Select your Top Menu from wp menus
Breaking News

షూటింగ్ కు సరిగ్గా రావడం లేదు … శింభుపై నిర్మాత జ్ఞానవేల్ రాజా ఫిర్యాదు!

షూటింగ్ కు సరిగ్గా రావడం లేదు …  శింభుపై నిర్మాత జ్ఞానవేల్ రాజా ఫిర్యాదు!

దక్షిణాది చిత్ర పరిశ్రమలో పరిచయం అవసరం లేని హీరో శింబుపై, భారీ చిత్రాల నిర్మాత జ్ఞానవేల్ రాజా నిర్మాతల కౌన్సిల్ లో ఫిర్యాదు చేశారు. శింబు సక్రమంగా షూటింగ్‌ కు రాని కారణంగా తన చిత్ర నిర్మాణ ఖర్చులు భారీగా పెరిగి పోయాయని ఆయన అన్నారు.శింభు వైఖరితో చిత్రంలో నటిస్తున్న ఇతర నటీనటుల షూటింగ్‌ కు అంతరాయం కలిగిందని, తాను వారికి నష్టపరిహారం చెల్లించాల్సి వస్తోందని వాపోయారు. తన పొరపాటు లేకుండానే డబ్బులు అధికంగా ఖర్చవుతున్నాయని, దీనికి శింబు కారణమని, సినిమా షూటింగ్ ప్రారంభమైన తరువాత పదిరోజుల పాటు ఒక్క సీన్ షూటింగ్ కూడా జరగలేదని మండలికి ఇచ్చిన ఫిర్యాదులో జ్ఞానవేల్ రాజా తెలిపారు.

Related posts