Select your Top Menu from wp menus
Breaking News

ఉమ్మడి వనరుల వారోత్సవాల …..

ఉమ్మడి వనరుల వారోత్సవాల …..

తలుపుల మండల కేంద్రంలోని పంచాయతీ కార్యాలయం నందు FESఆధ్వర్యంలో రైతులకు గ్రామస్తులకు ప్రపంచ ఉమ్మడి వనరుల వారోత్సవాల గురించి అవగాహన కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. కార్యక్రమంలో లో SPM రాణి రెడ్డి రైతులతో మాట్లాడుతూ ప్రతి ఒక్క గ్రామంలోనూ ఉమ్మడి వనరులను కొండగుట్ట, వాగువంక లను తమకు తాముగా గ్రామస్తులే సంరక్షించుకోవాలి అని మాట్లాడారు. అనంతరం ప్రభుత్వ హైస్కూల్ నందు పిల్లలకు ఉమ్మడి వనరుల గురించి అవగాహన కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. విద్యార్థులతో మాట్లాడుతూ ప్రతి ఒక్క విద్యార్థి మొక్కలు నాటి వాటిని సంరక్షించాలి అని ఆమె మాట్లాడారు SPM రాణి రెడ్డి, స్నేహేష్, ఫీల్డు ట్రైనర్లు శంకర్,రవి,రామంజులు, శ్రీధర్, ఉపాధి హామీ ఏపీఎం మధుసూదన్, వివిధ గ్రామాల నుండి వచ్చిన ఉమ్మడి వనరుల సంరక్షణ అధ్యక్షులు, విద్యార్థులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

Related posts