Select your Top Menu from wp menus
Breaking News

హార్సిలీహిల్స్ లో సిరిమల్లె పువ్వా…..

హార్సిలీహిల్స్ లో  సిరిమల్లె పువ్వా…..

ఓ అమాయక గిరిజన యువతి… ఓ మంత్రి కుమారుడు మధ్య జరిగే ప్రేమ కథ… రాజకీయ వైవిధ్యంతో తెరకెక్కుతున్న సిరిమల్లె పువ్వా చిత్రం షూటింగ్

చిత్రంలోని సన్నివేశాన్ని వివరిస్తున్న డైరెక్టర్ గౌతమ్ సవాంగ్

చిత్తూరు జిల్లా బి.కొత్తకోట మండలంలోని హార్సిలీ హిల్స్ లో శరవేగంగా జరుగుతోంది. హైదరాబాద్ కు చెందిన షకీరా మూవీస్ సంస్థ నిర్మాత కౌసర్ జహాన్ సారధ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమా విశేషాలను శుక్రవారం చిత్ర యూనిట్ మీడియాకు వివరించింది. ఈ సందర్భంగా దర్శకుడు గౌతమ్ మాట్లాడుతూ రాజకీయ విలువలతో వైవిధ్యభరితంగా ఈ సినిమాను తెరకెక్కిస్తున్నామన్నారు. అలాగే ప్రేమ, సెంటిమెంట్, కామెడీతో అన్ని కోణాల్లోనూ ప్రేక్షకుల మదిని దోచుకుంటుందన్నారు. హీరో శ్రీకర్ కృష్ణ మాట్లాడుతూ ఈ సినిమా ద్వారా ఎంట్రీ ఇస్తున్న తన నటన ప్రేక్షకులను మెప్పిస్తుందన్నారు. నూతన నటీనటులను ప్రోత్సహిస్తే మరిన్ని సినిమాలు తెరకెక్కుతాయన్నారు. హీరోయిన్ శ్రావణి నిక్కీ మాట్లాడుతూ తాను గతంలో రెండు సినిమాల్లో నటించానని ఈ సినిమా ద్వారా ప్రేక్షకులను మెప్పించగలనని ఆశాభావం వ్యక్తం చేశారు. ప్రముఖ నిర్మాత డాక్టర్ పార్థసారధి మాట్లాడుతూ చిన్న సినిమాలను ప్రోత్సహించాలన్నారు. పైరసీ ద్వారా చిత్ర పరిశ్రమ ఇబ్బందులు పడుతుందన్నారు. సిరిమల్లెపువ్వ పేరుతో వచ్చిన సినిమాలన్నీ సక్సెస్ అయ్యాయన్నారు. ఈ ప్రెస్ మీట్ లో  ఆర్ట్ డైరెక్టర్ వాసు, ప్రొడక్షన్ మేనేజర్ లక్ష్మణ్ ,చిత్ర యూనిట్ సభ్యులు పాల్గొన్నారు.

Related posts