Select your Top Menu from wp menus
Breaking News

పార్లమెంటులో టీడీపీ కార్యాలయం వైసీపీకి కేటాయింపు!

పార్లమెంటులో టీడీపీ కార్యాలయం వైసీపీకి కేటాయింపు!
  • గ్రౌండ్ ఫ్లోర్ లోని 5వ గది వైసీపీకి కేటాయింపు
  • 15 పార్టీలకు కార్యాలయాలను కేటాయిస్తూ లోక్ సభ స్పీకర్ ఉత్తర్వులు
  • ఐదుగురి కంటే ఎక్కువ ఎంపీలు ఉంటేనే కార్యాలయాల కేటాయింపు

గత లోక్ సభలో వచ్చిన మెజార్టీ ఆధారంగా పార్లమెంటులో వివిధ పార్టీలకు పార్లమెంటరీ పార్టీ కార్యాలయాలను కేటాయించారు. మొత్తం 15 పార్టీలకు గదులను కేటాయిస్తూ లోక్ సభ స్పీకర్ ఉత్తర్వులను జారీ చేశారు. ఈ క్రమంలో పార్లమెంటులోని గ్రౌండ్ ఫ్లోర్ లో ఉన్న 5వ నెంబర్ గదిని వైసీపీకి కేటాయించారు. గతంలో ఈ గదిని టీడీపీకి కేటాయించారు. ఎంపీల సంఖ్యను ఆధారంగా చేసుకునే ఈ కేటాయింపులు ఉంటాయి. ఐదుగురు కంటే ఎక్కువ ఎంపీలు ఉంటేనే పార్టీకి కార్యాలయాన్ని కేటాయిస్తారు. బీజేపీకి గ్రౌండ్ ఫ్లోర్ లో 2, 3, 4 గదులు… కాంగ్రెస్ కు గ్రౌండ్ ఫ్లోర్ లో 24, 25 నెంబర్ గదులు, టీఆర్ఎస్ కు థర్డ్ ఫ్లోర్ లోని 125వ నెంబర్ గదిని కేటాయించారు.

Related posts