Select your Top Menu from wp menus

వేదికగా హైదరాబాద్ – గచ్చిబౌలి స్టేడియం బాలు, ఏసుదాస్, చిత్రల ‘వాయిస్ ఆఫ్ లెజెండ్స్’

వేదికగా హైదరాబాద్ – గచ్చిబౌలి స్టేడియం బాలు, ఏసుదాస్, చిత్రల ‘వాయిస్ ఆఫ్ లెజెండ్స్’

తెలుగు పాటను తేనెలో ముంచిన గాయకుడు బాలు. ఏసుదాస్ స్వరానికి ఆకాశమే హద్దు. మనసులను మంత్రించే స్వర పరిమళం చిత్ర సొంతం. ఈ ముగ్గురు గాయనీ గాయకులు వివిధ భాషల్లో పాటల పావురాలను ఎగరేశారు. కోట్లాది శ్రోతల హృదయాలను గెలుచుకున్నారు. అలాంటి ఈ ముగ్గురు గాయనీ గాయకులు ఒకే వేదికపై పాటల పండుగ చేయనున్నారు. ‘వాయిస్ ఆఫ్ లెజెండ్స్’ పేరుతో ఈ కార్యక్రమం నవంబర్ 30న జరగనుంది. ఇందుకు హైదరాబాదులోని ‘గచ్చిబౌలి’ స్టేడియం వేదిక కానుంది.బాలు తనయుడు చరణ్ ఆధ్వర్యంలో ఈ సంగీత కచేరి జరగనుంది. ఈ విషయాన్ని గురించి బాలూ మాట్లాడుతూ, “గతంలో వేరే కంట్రీస్ లో సంగీత కచేరీలు చేశాము .. తెలుగులో జరుగుతోన్న తొలి సంగీత కచేరి ఇది. ఈ కచేరీలో కేవలం తెలుగు పాటలను మాత్రమే పాడనున్నాము. కర్ణాటక .. తమిళనాడు ప్రాంతానికి చెందిన ప్రొఫెషనల్ మ్యుజిషియన్స్ ఈ లైవ్ షోకు మ్యూజిక్ బ్యాండ్ గా వ్యవహరించనున్నారు. వ్యాపార ధోరిణిలో చేస్తోన్న ఒక అందమైన సాంస్కృతిక కార్యక్రమం ఇది” అని చెప్పుకొచ్చారు.

Related posts