● అంగన్వాడి కార్యాలయంలో లేని పిల్లలపై కూడా గుడ్లు మింగుతున్న కార్యకర్తలు.

● పౌష్టికాహారం దారే సపరేటు.

● పర్యవేక్షణ లోపం కొట్టొచ్చినట్టు కనిపిస్తున్న అధికారులు చర్యలు ఏవి

తనకల్లు మండలంలోని అంగన్వాడీ కేంద్రాలను ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా పి డి చిన్మయాదేవి మండలం లోని చీకటి మాని పల్లి అంగన్వాడి కేంద్రాన్ని పిడి చిన్మయ దేవి ఆకస్మికంగా తనిఖీ చేశారు .ఈ తనిఖీలో చికటిమనిపల్లి అంగన్వాడి-2 కేంద్రానికి తాళం వేశారు . కాగా ఈ సమయానికి కార్యకర్తలు కేంద్రాన్ని నిర్వహించకుండా ఎక్కడి కి వెళ్లారని పిడి చిన్మయా దేవి అంగన్వాడి కార్యకర్తలకు ప్రశ్నించగా పొంతన లేని సమాధానాలు చెబుతూ ఈ విషయాన్ని దాటవేసిన్నట్లు సమాచారం అందింది . ఇదే నెలలో ఉప్పు వాండ్ల పల్లి లో సిడిపిఓ తనిఖీ చేయగా అక్కడ కూడా అంగన్వాడీ కేంద్రంలో కార్యకర్తల లేకపోవడం,రికార్డులు లేకపోవడం గమనించిన విషయం తెలిసిందే. అయినా కొన్ని అంగన్వాడీ కేంద్రాలలో ఇలాంటి సంఘటనలు చోటు చేసుకుంటున్నాయని ప్రజలు మాట్లాడు కుంటున్నారు . అదేవిధంగా అంగన్వాడి కేంద్రంలో లేని పిల్లలకు పౌష్టికాహారం  పాలు గ్రుడ్లు  అందిస్తున్నట్టు వివరాలలో ఎక్కువమంది పిల్లలను పొందుపరుస్తూ ఉన్నారని ప్రజలు మాట్లాడుకుంటున్నారు. ఇదే సందర్భంలో పీడీ మండల పరిధిలోని మండ్లీ పల్లి లోని అంగన్వాడి కేంద్రాన్ని తనిఖీ చేసి కేంద్రంలోని రికార్డులను పరిసించి సరిగానే ఉన్నాయని ఆమె అన్నట్లు సమాచారం.అదేవిధంగా పిల్లలకు సరైన వసతులు ఉండేలా చూడాలన్నారు. అంతేకాకుండా అన్ని కేంద్రాల్లో కూడా కార్యకర్తలు సరిగా పని చేయాలని అన్నారు. ఎవరైనా విధి నిర్వహణలో సరిగా వారికి కేటాయించిన పనిని సక్రమంగా నిర్వర్తించకపోతే వారిని ఉపేక్షించేది లేదన్నట్లు సమాచారం.