తనకల్లు మండల కేంద్రంలో మంగళవారం తాహసిల్దార్ కార్యాలయంలో అగ్రికల్చర్ అధికారులు చేపట్టిన ప్రత్యామ్నాయ విత్తన పంపిణీ లో 502 మంది రైతులకు 50.20 క్వింటాల విత్తన పంపిణీ చేయడం జరిగిందని మండల వ్యవసాయ అధికారి శ్రీహరి నాయక్ తెలిపారు. ప్రత్యామ్నాయ విత్తనం కోసం క్యూలైన్లలో వేచి ఉన్న మహిళా రైతులతో వ్యవసాయ అధికారి ఏడి సత్యనారాయణ వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో ఏ డి సత్యనారాయణ వెంట ఏవో శ్రీహరి నాయక్ ఉన్నారు.