తనకల్లు మండల పరిధిలో రైతులు తీవ్ర వర్షాభావ పరిస్థితులలో అటు వేరుశనగ ఎండిపోయి రైతన్నలకు కన్నీళ్లే మిగిల్చాయి.

ప్రభుత్వం ప్రత్యామ్నాయ విత్తనాల రూపంలో వేరుశనగ వేసిన రైతులు కూడా ప్రత్యామ్నాయ విత్తనాలను అందించే విధంగా సన్నాహకాలు చేపట్టాయని
20|08|2019 మంగళవారం నుండి మండల కేంద్రంలో తహసిల్దార్ కార్యాలయం నందు ప్రత్యామ్నాయ విత్తనాల పంపిణీ కొనసాగుతోందని మండల వ్యవసాయ అధికారి శ్రీహరి నాయక్ తెలిపారు.

తనకల్లు మండలం లోని ప్రతి ఒక్క గ్రామానికి వారికి కేటాయించిన తేదీలలో పట్టాదారు పాసుపుస్తకం మరియు వారి ఆధార్ కార్డు ను తీసుకుని వచ్చి ప్రత్యామ్నాయ విత్తనాలను పొందాలని సూచించారు.

అదేవిధంగా ఒక్కొక్క లబ్దిదారునికి 10 నుండి 15 కేజీలు పంపిణీ చేస్తున్నట్లు ఈ విధానంలో బయోమెట్రిక్ కు ఆధార్ కార్డును ముఖ్యంగా పరిశీలనలోకి తీసుకుంటున్నట్లు తెలిపారు.

తనకల్లు మండలానికి 15 వందల క్వింటాళ్లు ప్రత్యామ్నాయ విత్తనాలు రావాల్సి ఉండగా కేవలం 500 క్వింటాళ్ల రావడం జరిగిందని AO తెలిపారు.

అనంతరం AO మాట్లాడుతూ ఆదివారం కురిసిన వర్షం 35 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైనట్లు ప్రత్యామ్నాయ విత్తనాలు విత్తు కోవడానికి సరైన అవకాశమని తెలిపారు.