ప్రపంచ ఆదివాసీల దినోత్సవంలో పాల్గొన్న ఎమ్మెల్యే డాక్టర్ సిద్ధారెడ్డి…

తనకల్లు మండల పరిధిలోని సి జి ప్రాజెక్టు వద్ద ఉన్నటువంటి గురు కుల పాఠశాల నందు ఏర్పాటు చేసిన ప్రపంచ ఆదివాసీల దినోత్సవం గిరిజన నాయకులు సుధాకర్ నాయక్, వాలేనాయక్, శ్రీరాములు నాయక్ ల అధ్యక్షత నఏర్పాటు చేసిన ప్రపంచ ఆదివాసీల దినోత్సవానికి కదిరి శాసనసభ్యులు ఎమ్మెల్యే డాక్టర్ పెడబల్లి వెంకట సిద్దారెడ్డి ముఖ్యఅతిథిగా హాజరయ్యారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే సిద్దారెడ్డి మాట్లాడుతూ మొదటగా విద్యను అభ్యసిస్తున్న విద్యార్థులకు ప్రపంచ ఆదివాసీల దినోత్సవ శుభాకాంక్షలు లతో పాటు ఆయన ఆశీస్సులు తెలిపారు. అనంతరం దాదాపుగా 5 సంవత్సరాల క్రితం ఈ పాఠశాల ప్రారంభోత్సవం సందర్భంగా ఇక్కడికి వచ్చానని ఈ సందర్భంలో ఎక్కడికి మళ్ళీ ఎమ్మెల్యే హోదాలో వచ్చినందుకు ఎంతో సంతోషంగా ఉందన్నారు.గిరిజనులు అంటే ప్రకృతి ప్రసాదించిన ముద్దు బిడ్డలని అన్నారు.సంకృతులు ఉత్పత్తులు అన్నీకూడా ఈరోజు ఆధునిక పద్దతులను అలవారుచుకున్నాయన్నారు. ఒకప్పుడు ఆదివాసీలు కొండ, కోన గుట్టల్లో ఉండేవారని అదేవిధంగా కాల క్రమేణా సంకృతి తో పాటు మన బాష జీవనం ఎంతో అభివృద్ధి చెందాయని వాటిని అలానే కాపాడుకుంటూ వస్తున్నరని వాటిని కాపాడుకోవాల్సిన బాధ్యత మన పై ఉందన్నారు. ఈరోజు సమాజంలో ముందంజలో ఉన్నారని అన్నారు. ఎప్పటికి బాషా, సంకృతి ని మరవకుదన్నారు. అదేవిధంగా నూతనంగా ఏర్పడిన ప్రభుత్వాన్ని ఆశీర్వదించాలని అన్నారు. ఈ సందర్భంగా గిరిజన నాయకులు మాట్లాడుతూ తనకల్లు మండలం లో గిరిజన ఇంటర్,డిగ్రీ కళాశాలను ఏర్పాటు చేయాలని కోరారు. వెంటనే ఎమ్మెల్యే సందిస్తూ నాసహకరం మీకు ఎల్లపుడు వుంటుందని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో వైసిపి మండల కన్వీనర్ మధుసూదన్ రెడ్డి మహిళా మండల కన్వీనర్ విజయమ్మ అరుణ సదన్ సహకార సంఘం అధ్యక్షురాలు మాజీ ఎంపీపీ లక్ష్మి నారాయణమ్మ ముస్తఫా తబ్రేజ్ నవీన్ కుమార్ రెడ్డి రమన్ కుమార్ రెడ్డి పూల శీను తో పాటు తదితర నాయకులు పాల్గొన్నారు