మహేశ్ బాబు హీరోగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో ‘సరిలేరు నీకెవ్వరు’ రూపొందుతోంది. ఇటీవలే ఈ సినిమా రెగ్యులర్ షూటింగు మొదలైంది. మహేశ్ బాబు తదితరులపై కొన్ని సన్నివేశాలను కశ్మీర్ లోను చిత్రీకరించారు. ఈ సినిమా కోసం హైదరాబాద్ – రామోజీ ఫిల్మ్ సిటీలో ఒక భారీ సెట్ వేస్తున్నారు. కర్నూల్ – కొండారెడ్డి బురుజు, ఆ పరిసర వీధులకు సంబంధించిన సెట్ ను వేస్తున్నారు. సెట్ అవసరం లేదని మొదట అనుకున్నప్పటికీ, ఆ తరువాత అసలు లొకేషన్ లో షూటింగ్ జరపడంలోని సమస్యలను గుర్తించి ఈ నిర్ణయం తీసుకున్నారని అంటున్నారు. ఈ సెట్ కోసం 4 కోట్లకి పైగా ఖర్చు చేయనున్నట్టు తెలుస్తోంది. ఇక అన్నపూర్ణ స్టూడియోలో ట్రైన్ సెట్ ను .. విజయశాంతి ఇంటి కోసం ఒక సెట్ ను వేస్తున్నారు. భారీ సెట్లలో చకచకా షూటింగును కానిచ్చేసి, సంక్రాంతికి విడుదల చేయాలనే ఆలోచనలో వున్నారు.