*భూ ఆక్రమణ ఫిర్యాదు పై విచారణ చేసిన అధికారులు*
ఆక్రమణ నిజమని తేలడంతో కేసు నమోదు చేయాలంటున్న బాధితుడు
మండల పరిధిలోని బిళ్లురివాండ్ల పల్లి గ్రామ సమీపంలోని 651-1లోఉన్న నాహక్కు అనుభవం లో ఉన్న భూమిని అక్రమించాడంటూ హైదర్ వళి పోలీస్ స్టేషన్లో పిర్యాదు చేసిన విషయం తెలిసిందే.
ఆ ఫిర్యాదును స్థానిక ఎస్సై రంగడు రెవిన్యూ అదికారులకు బదిలీ చేయగా శనివారం సర్వేయర్ బృందం పోలీసు సిబ్బంది తో పొలం వద్దకు వచ్చి కొలతలు వేశారు.హైదర్ వళి తన పొలం సరిహద్దు లో నిర్మించుకున్న రాళ్ళ కట్టడాలను,ప్రభుత్వం వారు సర్వే చేసి నాటిన నెంబర్ రాళ్లను తొలగించడమే కాక హైదర్ వళి భూమిలోనే విద్యుత్ స్తంభాలు, ట్రాన్స్ఫార్మర్ ఉన్నట్లు ప్రాథమిక సర్వే లో తేలింది.సర్వే చేయడానికి వచ్చిన అధికారుల అనుమతి పత్రం పై కె. ఓబులేసు అనే వ్యక్తి యు. ఓబులేసు గా సంతకం చేయడం అందరిని ఆశ్చర్యపరిచింది.ఈ విషయం తహశీల్దార్ సుబ్బలక్ష్మి దృష్టికి తీసుకొనిపోగా, యు. ఓబులేసు కు, కె.ఓబులేసు కు నోటీసు లు పంపి రికార్డులను పరిశీలన చేస్తామన్నారు.
*కేసు నమోదు చేయాల్సిందే*:- మా భూమిని ఆక్రమించావని గ్రామ పెద్దలతో హైదర్ వళి భూమి ఆక్రమించుకున్న వారి ఇంటి వద్దకు పోయి అడుగగా పోలీసులకు పోన్ చేసి స్టేషన్ కు తరలించారని ఈ రోజు కొలతలు వేయగా నాభూమిని అక్రమించినట్టు తేలిందని ,కేసునమోదు చేయాల్సిందే అని విలేకరులతో తెలిపాడు. ఈ కొలతలు వేసిన తరువాత మాది తప్పు అని తేలిఉంటే ఈ పాటికి నన్ను జైలు పాలు చేసి ఉండే వాడని వాపోయాడు.