ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో ఇస్మార్ట్ శంకర్ మేనియా నడుస్తోంది. పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో రామ్ హీరోగా వచ్చిన పక్కా మాస్ ఎంటర్టయినర్ ‘ఇస్మార్ట్ శంకర్’ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. కాగా, ఈ సినిమా చూసేందుకు దర్శకుడు రామ్ గోపాల్ వర్మ కూడా ఉబలాటపడుతున్నారు. ఇప్పటికే తన శిష్యుడు పూరీ జగన్నాథ్ ఇచ్చిన పార్టీలో ఫుల్లుగా ఎంజాయ్ చేసిన వర్మ ఇప్పుడు మరో ఇద్దరు శిష్యులతో కలిసి పక్కా మాస్ గెటప్పులో ‘ఇస్మార్ట్ శంకర్’ సినిమా చూసేందుకు థియేటర్ కు తరలివెళ్లారు.