ఆంధ్రప్రదేశ్ లోని నెల్లూరు జిల్లాలో ఉన్న ‘నారాయణ కాలేజీ’లో ఈరోజు ప్రమాదం చోటుచేసుకుంది. నెల్లూరులోని అరవింద్ నగర్ లో ఓ భవంతిలో నారాయణ కాలేజీని నిర్వహిస్తున్నారు. అయితే ఈరోజు భవనానికి సంబంధించిన ఓ గోడ అకస్మాత్తుగా కూలిపోయింది. దీంతో ఆరుగురు విద్యార్థులు గోడ శిథిలాల కింద చిక్కుకున్నారు. వెంటనే అప్రమత్తమైన ఉపాధ్యాయులు, కాలేజీ నిర్వాహకులు గాయపడ్డ విద్యార్థులను హుటాహుటిన సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. ఈ విద్యార్థులకు గాయాలు అయ్యాయనీ, అయితే ప్రాణాపాయం లేదని వైద్యులు తెలిపారు