తెలంగాణ కాంగ్రెస్ నాయకత్వంపై ఆ పార్టీ సీనియర్ నేత వి.హనుమంతరావు అసహనం వ్యక్తం చేశారు. పార్టీకి వ్యతిరేకంగా ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్న కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిపై ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని ఆయన ప్రశ్నించారు. నల్గొండ నాయకులు వారికి తోచినట్టు మాట్లాడవచ్చా? అని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇది తెలంగాణ కాంగ్రెస్సా? లేక నల్గొండ కాంగ్రెస్సా? అని ప్రశ్నించారు. సర్వే సత్యనారాయణ విషయంలో ఒకలా ప్రవర్తించిన పార్టీ అధిష్ఠానం… కోమటిరెడ్డి విషయంలో ఎందుకు మౌనంగా ఉంటోందని అన్నారు. కోమటిరెడ్డిని ఏ పార్టీ కూడా చేర్చుకోదని చెప్పారు.