ప్రముఖ తెలుగు టీవీ ఛానల్ లో ప్రసారమయ్యే జబర్దస్త్ షో ఆర్టిస్ట్ వినోద్ పై హత్యాయత్నం జరిగింది. ఈ షోలో.. లేడీ గెటప్ లో కనిపించే వినోద్ జబర్దస్త్ వీక్షకులకి సుపరిచితమే. ఈ దాడిలో వినోద్ తీవ్రంగా గాయపడ్డాడు.జులై 19వ తేదీ శుక్రవారం రాత్రి తన ఇంట్లో ఉన్న సమయంలోనే ఈ ఘటన జరిగింది. వివరాల్లోకి వెళితే..నగరంలోని కాచిగూడ పోలీస్ స్టేషన్ పరిధిలోని కుత్బిగూడలో వినోద్ నివాసం ఉంటున్నాడు . అర్థరాత్రి సమయంలో అతనిపై దాడి జరిగింది. ఇంటి ఓనరే దాడి చేసినట్లు కాచిగూడ పోలీసులకు వినోద్ ఫిర్యాదు చేశాడు. ఈ దాడిలో శరీరంపై గాయాలు అయ్యాయి. . కంటికి బలమైన గాయం అయ్యింది. కంటి దగ్గర కుట్లు పడ్డాయి. కన్ను బాగా వాచిపోయింది. నుదిటపైనా గాయమైంది. ప్రస్తుతం వినోద్.. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఆస్పత్రిలో గాయంతోపాటు చికిత్స తర్వాత ఫొటోలు బయటకు వచ్చాయి. వినోద్ పై దాడికి సంబంధించి కంప్లయింట్ అందుకున్న పోలీసులు విచారణ చేపట్టారు. ఇంటి యజమానిని ప్రశ్నించనున్నారు.ఇంటి ఓనర్ ఎందుకు దాడి చేశాడు.. ఇద్దరి మధ్య గొడవ ఏంటీ అనేది తెలియాల్సి ఉంది.