Select your Top Menu from wp menus
Breaking News

గవర్నర్ ఆదేశాలపై సుప్రీంకోర్టును ఆశ్రయించిన సీఎం కుమారస్వామి

గవర్నర్ ఆదేశాలపై సుప్రీంకోర్టును ఆశ్రయించిన సీఎం కుమారస్వామి

ఈరోజు మధ్యాహ్నం 1.30 గంటల్లోపు మెజారిటీ నిరూపించుకోవాలని కర్ణాటకలోని సంకీర్ణ సర్కారుకు గవర్నర్ వాజుభాయ్ వాలా ఇచ్చిన గడువు దాటిపోయింది. ఈ నేపథ్యంలో మరోసారి చొరవ తీసుకున్న గవర్నర్, సీఎం కుమారస్వామికి మళ్లీ లేఖ రాశారు. ఈ  రోజు సాయంత్రం 6 గంటల లోపు బలనిరూపణ చేయాలంటూ ఆ లేఖలో పేర్కొన్నారు. ఈ ఆదేశాలను సవాల్ చేస్తూ సుప్రీంకోర్టును కుమారస్వామి ఆశ్రయించారు. సభలో బలనిరూపణ చేసుకోవాలంటూ గవర్నర్ డెడ్ లైన్ విధించడం రాజ్యాంగం విరుద్ధమని తన పిటిషన్ లో పేర్కొన్నారు.ఇదిలా ఉండగా, కర్ణాటక కాంగ్రెస్ అధ్యక్షుడు దినేశ్ గుండూరావు సుప్రీంకోర్టులో ఓ పిటిషన్ దాఖలు చేశారు. ఈ నెల 17న సుప్రీంకోర్టు ఉత్తర్వుల్లో విప్ పై స్పష్టత ఇవ్వాలని ఆ పిటిషన్ లో కోరారు. అసెంబ్లీకి రాజీనామా చేసిన 15 మంది ఎమ్మెల్యేల హాజరుపై బలవంతం చేయలేమన్న న్యాయస్థానం ఆదేశాలపై స్పష్టత ఇవ్వాలని, విప్ జారీ చేయడం రాజకీయ పార్టీకి ఉన్న హక్కు అని, సుప్రీంకోర్టు తీర్పు10వ షెడ్యూల్ ఉల్లంఘన కిందికి వస్తుందని ఆ పిటిషన్ లో తెలిపారు.

Related posts