Select your Top Menu from wp menus

ప్రభుత్వ భూములు లక్షల రూపాయలు…. అన్యాక్రాంతమవుతున్న చోద్యం చూస్తున్న రెవెన్యూ అధికారులు…

ప్రభుత్వ భూములు లక్షల రూపాయలు…. అన్యాక్రాంతమవుతున్న చోద్యం చూస్తున్న రెవెన్యూ అధికారులు…

*ప్రభుత్వ భూములు లక్షల రూపాయలు* *అన్యాక్రాంతమవుతున్న చోద్యం చూస్తున్న రెవెన్యూ అధికారులు*…

మండల పరిధిలో ఉన్నటువంటి 17 గ్రామ పంచాయతీలకు సంబంధించిన అసైన్డ్ భూములు అన్యాక్రాంతం కు గురవుతున్నాయని తనకల్లు మండల కాంగ్రెస్ పార్టీ కన్వీనర్ తోపు పారేష్ తాహసిల్దార్ సుబ్బలక్ష్మికి సోమవారం స్పందన కార్యక్రమంలో వినతి పత్రాన్ని అందజేశారు. పలుకుబడి ఉన్నవారికి రెవిన్యూ అధికారుల అండదండలతో అసైన్డ్ భూములను ఆక్రమించుకున్నారని ఆ భూములను ప్లాట్లుగా వేసి పేద ప్రజలకు లక్షల రూపాయలకు అంటగడుతున్నారని ఇందులో ముఖ్యంగా కొక్కంటి క్రాస్,తనకల్లు,తవలం, బొంతల పల్లి లో ఎక్కువగా భూ ఆక్రమణలు జరుగుతున్న రక్షించాల్సిన ప్రభుత్వ అధికారులే చోద్యం చూస్తున్నారని మరియు వారికి భూ ఆక్రమణ లో రెవిన్యూ అధికారులే సహాయం చేస్తున్నారని ఆరోపించారు. కావున పై గ్రామాలలో జరిగిన భూ అక్రమాలను అరికట్టి విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని లేదంటే కాంగ్రెస్ పార్టీ మండల శాఖ ఆధ్వర్యంలో రెవెన్యూ ఆఫీస్ కార్యాలయాన్ని ముట్టడించి కార్యక్రమం చేపడతామని ఈ సందర్భంగా మాట్లాడారు.

Related posts