1. చిత్తూరు జిల్లా తంబళ్లపల్లి నియోజకవర్గం బి.కొత్తకోట లోని స్థానిక పీటీయం రోడ్డు నందు నీటి సమస్య ఎక్కువగా ఉండటంతో మహిళలు ఖాళీ బిందెలతో రోడ్డుపై బైటాయించి వాహనరాకపోకలను ఆపి ఆందోళన వ్యక్తం చేశారు. తాగునీరు సరఫరా కాకుంటే తాము ఎలా జీవనం సాగించాలన్నారు. సమస్యకు అధికారులు పరిష్కారం చూపేంతవరకు రోడ్డుపై నుంచి లేవమంటూ భీష్మించుకుని రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపారు. పలుమార్లు అధికారుల దృష్టికి తీసుకెళ్లినా నీటి పైన బుడగలా వవహరిస్తున్నారని మహిళలు వాపోయారు. దీంతో సంఘటనాస్థలానికిచేరుకున్నపోలీసులు,పంచాయతీ  EO పవన్ కుమార్ తక్షణం. 2 ట్యాంకర్ల నీటిని  అందిస్తామని హామీ ఇచ్చినా మహిళలు ఆగ్రహం వ్యక్తం చేశారు. మాకు సమస్య వచ్చినప్పుడు ఇలా వ్యవహరించి వెళ్తున్నారా తప్ప సమస్య పరిష్కారానికి మార్గాలు వెతకడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. మీ సమస్యను కచ్చితంగా తీరుస్తామని EO పవన్ కుమార్ హామీ ఇవ్వడంతో మహిళలు నిరసనను విరమించారు