పలు కార్యక్రమాలకు యాంకరింగ్ చేస్తూ.. అటు అప్పుడప్పుడు సినిమాల్లో కూడా నటిస్తూ వస్తున్న అనసూయ త్వరలో చిత్ర నిర్మాణాన్ని చేబట్టనుంది. ఈ విషయాన్ని తనే తాజాగా వెల్లడిస్తూ, కొత్త టాలెంట్ ను ప్రోత్సహించాలన్న ఉద్దేశంతో చిత్ర నిర్మాణంలోకి దిగనున్నట్టు తెలిపింది.
*  రవితేజ కథానాయకుడుగా వీఐ ఆనంద్ దర్శకత్వంలో రూపొందుతున్న ‘డిస్కో రాజా’ చిత్రానికి తాజాగా మరో హీరోయిన్ ను ఎంపిక చేశారు. ఇప్పటికే పాయల్ రాజ్ పుత్, నభా నటేశ్ లను నాయికలుగా తీసుకోగా, తాజాగా కన్నడ నటి తాన్యా హోప్ ను మూడవ కథానాయికగా తీసుకున్నారు.
*  తెలుగు, తమిళ, హిందీ భాషల్లో సినిమాలు చేస్తున్న కథానాయిక తమన్నా తాజాగా ఓ పెద్ద బ్రాండ్ కు ప్రచారకర్తగా ఎంపికైంది. డాబర్ హనీకి ఆమె బ్రాండ్ అంబాసడార్ గా వ్యవహరిస్తుంది. ఇందుకు సంబంధించిన వాణిజ్య చిత్రాన్ని తాజాగా విడుదల చేశారు.