Select your Top Menu from wp menus
Breaking News

సినిమా కబుర్లు.. సంక్షిప్త సమాచారం

సినిమా కబుర్లు.. సంక్షిప్త సమాచారం

‘సైరా’ తర్వాత చిరంజీవి తన తదుపరి చిత్రాన్ని కొరటాల శివ దర్శకత్వంలో చేయనున్నారు. ఇక ఇందులో కథానాయిక ఎవరన్న విషయమై ఆసక్తి నెలకొంది. ఈ చిత్రానికి శ్రుతి హాసన్ ని తీసుకున్నారని ఇటీవల వార్తలొచ్చాయి. అయితే, ఇందులో వాస్తవం లేదని నయనతారనే మళ్లీ ఎంచుకున్నారని తాజా సమాచారం.*  గతేడాది రామ్ చరణ్ నటించిన హిట్ చిత్రం ‘రంగస్థలం’ ఇప్పుడు కన్నడలోకి డబ్ అయింది. సుకుమార్ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రాన్ని ‘రంగస్థలి’ పేరిట అనువదించగా, ఈ నెల 12న కన్నడ నాట ఇది భారీ ఎత్తున రిలీజవుతోంది.*  దర్శకురాలు నందినిరెడ్డి రూపొందించిన ‘ఓ బేబి’ చిత్రం ఈ రోజు విడుదలవుతోంది. మరోపక్క ఆమె తన తదుపరి చిత్రానికి కూడా రెడీ అవుతోంది. వైజయంతీ మూవీస్ బ్యానర్లో తన తదుపరి చిత్రాన్ని చేస్తున్నానని, ఓ స్టార్ హీరో ఇందులో నటిస్తాడని నందిని రెడ్డి తాజాగా చెప్పింది.

Related posts