Select your Top Menu from wp menus
Breaking News

బి.కొత్తకోట లో ఘనంగా అల్లూరి సీతారామరాజు జయంతి మరియు స్వామి వివేకానంద వర్ధంతి

బి.కొత్తకోట లో ఘనంగా అల్లూరి సీతారామరాజు జయంతి మరియు స్వామి వివేకానంద వర్ధంతి

 

చిత్తూరు జిల్లా:   బి.కొత్తకోట మండలం ఎంపీడీవో కార్యాలయం నందు హెల్పింగ్ మైండ్స్ ఆధ్వర్యంలో మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు జయంతి మరియు స్వామి వివేకానంద వర్ధంతి సందర్భంగా వారి చిత్ర పటాలకు పూల మాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఎంపీడీవో నరేంద్ర కుమార్ మాట్లాడుతూ వారి యొక్క జీవితాలు ఆదర్శప్రాయమని,వారి అడుగు జాడల్లో నడిచి సమాజ శ్రేయస్సుకు నడుం బిగించాలని పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో మండల పరిషత్ అధికారులు, ఎంఈవో రెడ్డిశేఖర్ ,బి.కొత్తకోట హెల్పింగ్ మైండ్స్ ఇంచార్జ్ జాబీర్,నక్కా మహేష్,సంకుసబ్జి,సచిన్(బాస్),నరసింహనాయుడు,సాయి ప్రసాద్,నక్కా సంతోష్ కుమార్,దశరథ్ రెడ్డి,పవన్ మరియు ఎంపీడీవో కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు.

Related posts