Select your Top Menu from wp menus
Breaking News

అలాంటిదేం లేదన్న ‘రంగస్థలం’ నిర్మాత

అలాంటిదేం లేదన్న ‘రంగస్థలం’ నిర్మాత

కథలో బలం .. కథనంలో కొత్తదనం కలిగిన సినిమాలు చేయడంలో మైత్రీ మూవీ మేకర్స్ వారు మొదటినుంచి ప్రత్యేకమైన దృష్టిపెడుతూ వస్తున్నారు. ఈ కారణంగానే ఈ బ్యానర్లో ‘శ్రీమంతుడు’ .. ‘జనతా గ్యారేజ్’ .. ‘రంగస్థలం’ వంటి భారీ విజయాలు కనిపిస్తాయి. ఈ బ్యానర్ ప్రతిష్ఠను కాపాడటానికి నిర్మాతలైన నవీన్ యెర్నేని .. రవిశంకర్ .. సీవీ మోహన్ తమవంతు ప్రయత్నం చేస్తున్నారు.అలాంటి ఈ ముగ్గురిలో ఒకరైన నవీన్ యెర్నేని వేరేగా ఒక బ్యానర్ ను ఏర్పాటు చేసుకుంటున్నట్టుగా కొన్ని రోజులుగా ఒక వార్త షికారు చేస్తోంది. ముఖ్యంగా ఫిల్మ్ నగర్లో ఈ వార్త హాట్ టాపిక్ గా మారింది. అయితే ఈ విషయంపై ఆయన స్పందిస్తూ, తనకి అలాంటి ఉద్దేశమే లేదనే విషయం చెప్పారు. మైత్రీ బ్యానర్లోనే తాను నిర్మాతగా కొనసాగనున్నట్టు స్పష్టం చేశారు. దాంతో జోరుగా జరుగుతోన్న ప్రచారానికి ఫుల్ స్టాప్ పడిపోయింది.

Related posts