Select your Top Menu from wp menus
Breaking News

సినిమా కబుర్లు.. సంక్షిప్త సమాచారం

సినిమా కబుర్లు.. సంక్షిప్త సమాచారం

తాజాగా పూర్తయిన ‘సైరా’ చిత్రంలో చిరంజీవి సరసన నటించిన నయనతార మరోసారి ఆయనతో జతకట్టనుంది. చిరంజీవి హీరోగా కొరటాల శివ రూపొందించే చిత్రంలో ఇద్దరు హీరోయిన్లు వుంటారు. వీరిలో ఒకరిగా నయనతారను ఎంచుకున్నట్టు సమాచారం.*  ‘ధడక్’ సినిమాతో బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చి అందర్నీ ఆకట్టుకున్న శ్రీదేవి కూతురు జాన్వి కపూర్ మరో  చిత్రానికి ఓకే చెప్పింది. ‘దోస్తానా’ సీక్వెల్ ‘దోస్తానా 2’లో కార్తీక్ ఆర్యన్ సరసన హీరోయిన్ గా జాన్వి నటిస్తుంది.*  ఇటీవల సక్సెస్ లేక వెనుకపడిన దర్శకుడు సంపత్ నంది ఇప్పుడు మరో చిత్రాన్ని ప్లాన్ చేసుకుంటున్నాడు. నందమూరి కల్యాణ్ రామ్ హీరోగా ఓ చిత్రాన్ని రూపొందించనున్నాడు. సంపత్ చెప్పిన కథకు కల్యాణ్ రామ్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడట.

Related posts