• కల్యాణ్ కృష్ణతో మరోసారి నాగ్
  • లాభాల్లో వాటాకి ఓకే చెప్పిన కల్యాణ్ కృష్ణ
  •  నాగ్ మనవడి పాత్రలో చైతూ

నాగార్జున కెరియర్లో చెప్పుకోదగిన లాభాలను తెచ్చిపెట్టిన చిత్రాల జాబితాలో ‘సోగ్గాడే చిన్నినాయనా’ ఒకటిగా కనిపిస్తుంది. ఈ సినిమాలో ఆయన పోషించిన ‘బంగార్రాజు’ పాత్రను ప్రేక్షకులు ఇప్పట్లో మరిచిపోలేరు. అందువలన అదే టైటిల్ తో .. అదే దర్శకుడితో ఆయన సినిమా చేయడానికి రంగంలోకి దిగేశారు.

కల్యాణ్ కృష్ణ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాకి నాగార్జున నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. సాధారణంగా నాగార్జున తన సినిమా చేసిన దర్శకులకు పారితోషికం ఇచ్చేస్తుంటారు. కానీ కల్యాణ్ కృష్ణకి మాత్రం పారితోషికం ఇవ్వకుండా, సినిమా హిట్ అయితే లాభాల్లో వాటా ఇస్తానని చెప్పారట. అందుకు కల్యాణ్ కృష్ణ కూడా అంగీకరించాడనే టాక్ ఫిల్మ్ నగర్లో బలంగా వినిపిస్తోంది. ఈ సినిమాలో నాగ్ మనవడిగా చైతూ కనిపించనున్నాడని కూడా చెప్పుకుంటున్నారు.