Select your Top Menu from wp menus
Breaking News

‘మహర్షి’ 50 రోజుల వేడుక వాయిదా

‘మహర్షి’ 50 రోజుల వేడుక వాయిదా

వంశీ పైడిపల్లి దర్శకత్వంలో మహేశ్ బాబు 25వ సినిమాగా ‘మహర్షి’ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. విడుదలైన ప్రతి ప్రాంతంలోను ఈ సినిమా విజయవిహారం చేసింది. నిర్మాతలకి భారీ లాభాలను తెచ్చిపెట్టింది. అత్యధిక కేంద్రాల్లో ఈ సినిమా ఈ రోజుతో 50 రోజులను పూర్తి చేసుకోనుంది. దాంతో రేపు సాయంత్రం హైదరాబాద్ – శిల్పకళావేదికలో 50 రోజుల వేడుక నిర్వహించడానికి సన్నాహాలు చేశారు. అయితే నటుడు కృష్ణ భార్య విజయనిర్మల బుధవారం రాత్రి చనిపోవడంతో, ఆ ఇంట విషాద ఛాయలు అలుముకున్నాయి. ఈ కారణంగా ‘మహర్షి’ 50 రోజుల వేడుక కార్యక్రమాన్ని వాయిదా వేశారు. ఈ కార్యక్రమాన్ని మళ్లీ ఎప్పుడు ఎక్కడ నిర్వహిస్తారనేది త్వరలో తెలియజేయనున్నారు.

Related posts