• జగన్ ని ఎల్పీ నేతగా ఎన్నుకున్న పార్టీ ఎమ్మెల్యేలు
  • బొత్స ప్రతిపాదించగా బలపరిచిన ధర్మాన, పార్ధసారథి
  • ఈ రోజు సాయంత్రం గవర్నర్ ని కలవనున్న జగన్

వైఎస్సార్ ఎల్పీ నేతగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎన్నికయ్యారు. జగన్ ని ఎల్పీ నేతగా ఆ పార్టీ ఎమ్మెల్యేలు ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. తాడేపల్లిలోని వైసీపీ కార్యాలయంలో సమావేశం జరుగుతోంది. జగన్ ఎల్పీ నేతగా బొత్స సత్యనారాయణ ప్రతిపాదించగా, ధర్మాన ప్రసాదరావు, ఆదిమూలపు సురేశ్, పార్ధసారథి బలపరిచారు. ఏకవాక్య తీర్మానంతో వైఎస్సార్ ఎల్పీ నేతగా జగన్ ని ఎన్నుకుంటున్నట్టు ప్రకటించారు. కాగా, ఈ రోజు సాయంత్రం గవర్నర్ నరసింహన్ తో జగన్ భేటీ కానున్నారు.