Select your Top Menu from wp menus
Breaking News

విహారయాత్రకు బయలుదేరిన మహేశ్‌

విహారయాత్రకు బయలుదేరిన మహేశ్‌

A1 tv హైదరాబాద్ : ‘మహర్షి’ చిత్రీకరణతో ఫుల్ బిజీగా ఉన్న సూపర్ స్టార్ మహేశ్ బాబు తన భార్య నమ్రత శిరోద్కర్ , పిల్లలు గౌతమ్ , సితారలతో కలిసి విహారయాత్ర నిమిత్తం పారిస్ కు బయలుదేరారు. ఈ విషయాన్ని నమ్రత ఇన్ స్టాగ్రామ్ ద్వారా వెల్లడిస్తూ మహేశ్ తో కలిసి దిగిన ఫొటోను పంచుకున్నారు. ‘పారిస్ కు వెళుతున్నాం. అందరికీ ఈస్టర్ పర్వదిన శుభాకాంక్షలు’ అని క్యాప్షన్ ఇచ్చారు. విహారయాత్ర ముగించుకున్న అనంతరం మహేశ్ ‘మహర్షి’ ప్రచార కార్యక్రమాల్లో పాల్గొంటారు.
వంశీ పైడిపల్లి ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. పూజా హెగ్డే కథానాయికగా నటించారు. ‘అల్లరి’ నరేశ్ కీలక పాత్రను పోషించారు. ఈ చిత్రంలో మహేశ్ .. విద్యార్థిగా, కోటీశ్వరుడిగా, సాధారణ యువకుడిగా మూడు విభిన్న పాత్రల్లో కనిపిస్తారని టాక్ . దిల్ రాజు, అశ్వినీ దత్ , ప్రసాద్ వి పొట్లూరి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. దేవిశ్రీ ప్రసాద్ స్వరాలు సమకూర్చారు. మే 9న ‘మహర్షి’ ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు.

Related posts