Select your Top Menu from wp menus
Breaking News

ఘోర రోడ్డు ప్రమాదం..ఇద్దరు తెలుగు టీవీ ఆర్టిస్టులు మృతి

ఘోర రోడ్డు ప్రమాదం..ఇద్దరు తెలుగు టీవీ ఆర్టిస్టులు మృతి

A1tv news

రంగారెడ్డి జిల్లా మొయినాబాద్‌‌లో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు టీవీ ఆర్టిస్టులు దుర్మరణం చెందారు. ఎదురుగా వస్తున్న లారీని తప్పించబోయి వారు ప్రయాణిస్తున్న కారు చెట్టును ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగింది. ఓ సీరియల్‌ చిత్రీకరణలో భాగంగా టీవీ ఆర్టిస్టులు హైదరాబాద్‌ నగరం నుంచి సోమవారం రాత్రి వికారాబాద్‌ జిల్లా అనంతగిరి అడవులకు వెళ్లారు. షూటింగ్‌ అనంతరం కారులో హైదరాబాద్‌కు తిరుగు ప్రయాణమయ్యారు. మార్గ మధ్యలో వీరి కారు లారీని తప్పించబోయి చెట్టును ఢీకొంది.

కారులో ఉన్న నలుగురిలో ఇద్దరు మృతిచెందారు. నటి భార్గవి (20) ప్రమాద స్థలిలోనే చనిపోగా, అనుషారెడ్డి (21) ఆసుపత్రికి తరలిస్తుండగా మృతిచెందారు. కారు డ్రైవర్‌‌తో పాటు వినయ్‌కుమార్‌ అనే వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను ఉస్మానియా ఆస్పత్రికి తరలించినట్లు మొయినాబాద్‌ సీఐ వెంకటేశ్వర్లు తెలిపారు.

Related posts