
బీహార్‌లో జరగబోయే లోక్‌సభ ఎన్నికల్లో జెఎన్యూ విద్యార్థి సంఘం మాజీ అధ్యక్షుడు కన్నయ్యకుమార్‌కు బేగుసరాయ్ స్థానం కేటాయించాలన్న డిమాండ్ కారణంగానే రాష్ట్రీయ జనతాదళ్(ఆర్జేడీ), భారతీయ కమ్యూనిస్టు పార్టీ(సీపీఐ)ల మధ్య పొత్తు వివాదం నెలకొంది. కన్నయ్యపై నెలకొన్న వివాదాల కారణంగా అతని విజయంపై లాలూ సారధ్యంలోని ఆర్జీడీ పార్టీకి సందేహాలు నెలకొన్నాయి. దీనిపై ఆర్జేడీ ప్రతినిధి, ఎంపీ మనోజ్‌ఝా మాట్లాడుతూ సీపీఐ, ఆర్జేడీ మధ్య పొత్తు ఉండబోదని, ఎందుకంటే ఆర్జేడీ బేగుసరాయ్ నుంచి తన అభ్యర్థిగా తన్వీర్ హసన్‌ను బరిలోకి దించనుంది. స్థానికంగా ఆయనకు అక్కడ ఆదరణ ఉందని, అక్కడి పరిస్థితులపై పూర్తి అవగాహన ఉందన్నారు. అలాగే ఆర్జేడీ అత్యంత ఆదరణ కలిగిన పార్టీ అని, 2014 ఎన్నికల్లో మోదీ గాలులు వీస్తున్నప్పటికీ, ఆర్జేడీకి బేగుసరాయ్‌లో 4 లక్షల ఓట్లు లభించాయని, అందుకే ఆర్జేడీ బేగుసరాయ్ను వదులుకునే పరిస్థితి లేదని తెలిపారు. అలాగే తన్వీర్ హసన్ అభ్యర్థిత్వాన్ని ఆర్జేడీ నిర్లక్ష్యం చేయదన్నారు. పార్టీ క్యాడర్ కూడా తన్వీర్హసన్ నాయకత్వాన్ని కోరుకుంటున్నదన్నారు.