Select your Top Menu from wp menus
Breaking News

పవన్ కళ్యాణ్ ను కలిసిన గబ్బర్ సింగ్ చిత్ర బృందం

పవన్ కళ్యాణ్ ను కలిసిన గబ్బర్ సింగ్ చిత్ర బృందం

A1Tv news

అమరావతి: గబ్బర్ సింగ్ చిత్రంలోని నటీనటుల బృందం జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ ను కలిసింది. మంగళగిరిలోని జనసేన పార్టీ కార్యాలయంలో మంగళవారం ఉదయం వారు పవన్ ను కలిశారు. గబ్బర్ సింగ్ చిత్రంలోని అంత్యాక్షరి సన్నివేశం అప్పట్లో విపరీతంగా ప్రజాదరణ పొందిన సంగతి తెలిసిందే. ఈ సన్నివేశంలో కనిపించే నటుల్లో దాదాపు 13 మంది పవన్ ను కలిసిన వారిలో ఉన్నారు. తమ అభిమాన నటుడైన పవన్ కల్యాణ్ నేతృత్వంలోని జనసేన పార్టీ వచ్చే ఎన్నికల్లో విజయం సాధించాలని తాము కోరుకుంటున్నట్లు వారు తెలిపారు.

 

Related posts