Select your Top Menu from wp menus
Breaking News

ఘనంగా వెంకటేష్ కుమార్తె వివాహం

ఘనంగా వెంకటేష్ కుమార్తె వివాహం

జయపుర: విక్టరీ వెంకటేశ్ కుమార్తె ఆశ్రిత వివాహం ఆదివారం తెల్లవారుజామున అంగరంగ వైభవంగా జరిగింది. రాజస్థాన్ రాజధాని జయపురలోని ఓ హోటల్ లో ఆశ్రిత, హైదరాబాద్ రేస్ క్లబ్ ఛైర్మన్ సురేందర్ రెడ్డి మనవడు వినాయక్ రెడ్డిని వివాహం చేసుకున్నారు. వేడుకకు రామ్ చరణ్ , ఉపాసన, నాగచైతన్య, సమంత, సల్మాన్ ఖాన్ తదితర సినీ, రాజకీయ ప్రముఖులు హాజరై వధూవరులను ఆశీర్వదించారు. ఈ మేరకు శుక్రవారం రాత్రి జయపురలో ప్రీ వెడ్డింగ్ వేడుకలు నిర్వహించారు. ఈ వేడుకలో సమంత, నాగచైతన్య, రానా తదితరులు నృత్య ప్రదర్శన ఇచ్చినట్లు తెలుస్తోంది. ఫిబ్రవరి 6న ఆశ్రిత, వినాయక్ ల నిశ్చితార్థం జరిగిందట. కొన్నేళ్లుగా వీరిద్దరూ ప్రేమలో ఉన్నారు.

Related posts