Select your Top Menu from wp menus
Breaking News

రోడ్డు ప్రమాదంలో దర్శకుడు దుర్మరణం

రోడ్డు ప్రమాదంలో దర్శకుడు దుర్మరణం

రోడ్డు ప్రమాదంలో ఓ యువ దర్శకుడు మృతి చెందాడు.

కర్ణాటకలోని దక్షిణ కన్నడ జిల్లా మూడుబిద్రె శిర్థాడి వద్ద జరిగిన కారు ప్రమాదంలో ఆయన ప్రాణాలు కోల్పోయారు. కారు అదుపుతప్పి బలంగా చెట్టుకు ఢీకొట్టడంతో ఈ ప్రమాదం జరిగింది. మృతుడిని కన్నడ దర్శకుడు హ్యరిస్‌ హౌదాల్‌ గా గుర్తించారు. హ్యరిస్‌ నిద్రమత్తులో ఉండి కారు నడపడంతోనే ఈ ప్రమాదం జరిగినట్లు పోలీసులు తెలిపారు. శుక్రవారం తెల్లవారుజామున హ్యరిస్‌ కారులో మూడుబిద్రె నుండి శిరిడికు వెళ్తుండగా ప్రమాదం ఛోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో హ్యారిస్‌‌కు తీవ్రగాయాలయ్యాయి. దీంతో అతను అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. ఈ సంఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Related posts