Select your Top Menu from wp menus
Breaking News

రూ.కోటితో అభివృద్ధి చేస్తా:మంచు విష్ణు

రూ.కోటితో అభివృద్ధి చేస్తా:మంచు విష్ణు

A1 TV NEWS

హైదరాబాద్ : తిరుపతిలోని రుయా ప్రభుత్వ ఆసుపత్రిని అభివృద్ధి చేస్తానని సినీ నటుడు మంచు విష్ణు హామీ ఇచ్చారు. ఆయన తండ్రి, ప్రముఖ నటుడు మోహన్ బాబు పుట్టినరోజు సందర్భంగా విష్ణు ఈ స్ఫూర్తిదాయకమైన నిర్ణయం తీసుకున్నారు. ‘మా నాన్న పుట్టినరోజు సందర్భంగా ఓ నిర్ణయం తీసుకున్నా. మూడేళ్లలో రూ.కోటితో తిరుపతిలోని రుయా ప్రభుత్వ ఆసుపత్రిలో నియో నాటల్ ఐసీయూ, మెడికల్ ఐసీయూ, పీడియాట్రిక్ డిపార్ట్ మెంట్ లను అభివృద్ధి చేస్తా. అదేవిధంగా అత్యవసర, ఓపీడీ బ్లాక్ లను కూడా నిర్మిస్తాం. ఇవాళే తొలి చెక్ ఇచ్చా’ అని విష్ణు ట్వీట్ చేశారు. మోహన్ బాబు రెండో కుమారుడు మంచు మనోజ్ కూడా ఓ బాలికను దత్తత తీసుకున్నట్లు మంగళవారం వెల్లడించారు. ఐఏఎస్ అవ్వాలన్న ఆ బాలిక కల నిజం కావడానికి సహకరిస్తానని చెప్పారు.

Related posts