Select your Top Menu from wp menus
Breaking News

కసితో పెళ్లి చేసుకున్నా.. రెండు లవ్ ఫెయిల్యూర్స్

కసితో పెళ్లి చేసుకున్నా.. రెండు లవ్ ఫెయిల్యూర్స్

తన కెరీర్ ఆరంభంలో రెండు లవ్ ఫెయిల్యూర్స్ వలన ఇబ్బంది పడ్డానని జ్యోతి తెలిపింది. ప్రేమలో సక్సెస్ కాలేక పోయిన తర్వాత పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నా. ఓ ఈవెంట్ సందర్భంగా తన మాజీ భర్తతో పరిచయం ఏర్పడిందని జ్యోతి తెలిపింది.ఆ సమయంలో నాకు మెచ్యూరిటీ లేదు. పైగా ప్రేమ విఫలం అయిందనే భాద ఉంది. ఆ సమయంలో ఈవెంట్ లో మా ఇద్దరికీ పరిచయం అయింది. ఆయన పెళ్లి పట్ల సిన్సియర్ గా కనిపించారు. ప్రేమ విఫలమైందనే కసితో పెళ్లి చేసుకున్నా. నేనెంత తప్పు చేసానో పెళ్లి తర్వాతే అర్థం అయింది. మా ఇద్దరికీ మెచ్యూరిటీ లేకపోవడం వలన వైవాహిక జీవితంలో ఇబ్బందులు తలెత్తాయి. అవి చిన్న చిన్న గొడవలే. కానీ ఆ సమయంలో పెద్దవిగా అనిపించాయి. అందుకే విడిపోయినట్లు జ్యోతి తెలిపింది.

దేవుడు నాకిచ్చిన గొప్ప బహుభామతి నా కొడుకు. నా జీవితానికి వాడు చాలు. ఇంకెవరూ అవసరం లేదు. కానీ మేము చేసిన తప్పు వలన నా కొడుకు తండ్రి దూరమయ్యాడని తరచుగా భాదపడుతుంటా అని జ్యోతి తెలిపింది. అవకాశం దొరికితే వాడిని కూడా సినిమాల్లోకి తీసుకువస్తా అని జ్యోతి తెలిపింది.

Related posts