Select your Top Menu from wp menus
Breaking News

ఇద్దరంటనే కష్టం.. ఏకంగా ఏడుగురు హీరోయిన్లతో

ఇద్దరంటనే కష్టం.. ఏకంగా ఏడుగురు హీరోయిన్లతో

గతంలో ప్రేమ పావురాలు చిత్రంతో భాగ్యశ్రీ, పెళ్లి సందడితో దీప్తీ భట్నాగర్, జయంతో సదా లాంటి హీరోయిన్లు తెలుగు ప్రేక్షకులను అటు అందం, అభినయంతో రంజింపజేశారు. భాగ్యశ్రీ ఒకట్రెండు సినిమాలతో సినిమాలకు గుడ్ బై చెప్పగా, దీప్తీ భట్నాగర్ సినిమాల్లో నటిస్తూనే టెలివిజన్ రంగంలో బిజీ అయ్యారు. అలాంటి ఎంతో క్రేజ్ ఉన్న హీరోయిన్లు నేరుగా తెలుగులో రీ ఎంట్రీ ఇచ్చారు.గత నాలుగు రోజులుగా సినిమా కోసం మేమంతా ఫొటోషూట్స్‌ చేస్తున్నాం. దర్శక, నిర్మాతలు ఎక్కడా రాజీ పడటం లేదు. దర్శకుడు పవన్‌కి నిర్మాత గుప్తాగారు చాలా సపోర్ట్‌ చేస్తున్నారు. పవన్‌ ప్రతి విషయంలో చాలా పర్టిక్యులర్‌గా ఉంటారు. శంకర్‌గారి తర్వాత పవన్‌లో నేను అంత పర్‌ఫెక్షన్‌, డీటెయిలింగ్‌ చూస్తున్నా. కెరీర్‌లో ఫస్ట్‌ టైమ్‌ నేను ఒక సినిమాకు వర్క్‌షాప్‌ చేస్తున్నా. ఇద్దరు హీరోయిన్లు ఉంటే సెట్‌లో గొడవలు అవుతాయని అంటారు. మేం ఏడుగురున్నాం. ఏం గొడవలు లేవు. చాలా సరదాగా నవ్వుతూ వర్క్‌ చేస్తున్నాం అని సదా అన్నారు.

ఆచార్య క్రియేషన్స్‌, బ్లూ సర్కిల్‌ కార్పొరేషన్‌ పతాకాలపై సుందర్‌ పవన్‌ దర్శకుడిగా భోగేంద్ర గుప్తా నిర్మిస్తున్న సినిమా ‘కిట్టి పార్టీ’ చిత్రంలో ‘మైనే ప్యార్‌ కియా’ (తెలుగులో ‘ప్రేమ పావురాలు’) ఫేమ్‌ భాగ్య శ్రీ, ‘రోజా’ ఫేమ్‌ మధుబాల, ‘పెళ్లి సందడి’ ఫేమ్‌ దీప్తీ భట్నాగర్‌, సదా, సుమన్‌ రంగనాథ్‌, హరితేజ, హర్షవర్ధన్‌ రాణే, పూజా జవేరి నటిస్తున్నారు. బుధవారం హైదరాబాద్‌లో జరిగిన కార్యక్రమంలో ఈ సినిమా లోగో విడుదల చేశారు.

భాగ్య శ్రీ మాట్లాడుతూ ‘‘జీవితంలో ఒక్క మహిళను హ్యాండిల్‌ చేయడమే పురుషులకు కష్టమైన పని! నవ్వుతూ… మా దర్శకుడు సెట్‌లో మా ఏడుగురు మహిళలను హ్యాండిల్‌ చేయాలి. ఎలా చేస్తాడో! మహిళల దృక్కోణం నుంచి ఆలోచించి ఈ కథ రాసిన దర్శకుడు పవన్‌ని అభినందిస్తున్నా. మహిళల మనస్తత్వాలను అర్థం చేసుకున్నటువంటి దర్శకుడితో పని చేస్తున్నందుకు సంతోషంగా ఉంది అని అన్నారు.వినోదం కోసం తీస్తున్న సినిమా కాదిది. సమాజంలో అందరం కలిసి ఉన్నతస్థాయికి ఎదడగం, ఉన్నత జీవన ప్రమాణాల కోసం పని చేయడం వంటి అంశాలను చర్చిస్తూ తీస్తున్న చిత్రమిది. హాలీవుడ్‌లో వచ్చిన ‘డెస్పరేట్‌ హౌస్‌వైఫ్స్‌’, ‘సెక్స్‌ అండ్‌ ది సిటీ’ సినిమాల తరహాలో ఉంటుంది. సినిమాలో మేమంతా వివిధ పాత్రల్లో, వివిధ వయసుల గల మహిళలు నటిస్తున్నాం. ప్రేక్షకులకు తమ జీవితాల్లో ప్రతిరోజూ తారసపడే మహిళల్లో ఎవరో ఒకరు మా పాత్రల్లో ఏదో పాత్రలో కనిపిస్తారు. సినిమాలో మొదటి పాటను దర్శకుడు పవన్‌ నాకు వినిపించారు. చాలా బావుంది. విడుదలైన తర్వాత కొన్నేళ్ళ పాటు పార్టీల్లో ఆ పాట వినిపిస్తుంది అని భాగ్యశ్రీ అన్నారు.

మధుబాల మాట్లాడుతూ హీరోపై మాత్రమే ఎక్కువ ఫోకప్‌ చేసే ఇండస్ట్రీలో… హీరో ఎవరూ లేని ఒక సినిమాకు నేనే సంతకం చేశా. ఇటువంటి సినిమా తీస్తున్నందుకు, అందులో నాకు అవకాశం ఇచ్చినందుకు దర్శకుడు పవన్‌, నిర్మాత గుప్తాగారికి థ్యాంక్స్‌. ఇంతమంది మహిళలతో, కేవలం మహిళలు ప్రధాన పాత్రధారులుగా ఇటువంటి సినిమా తీయడానికి చాలా ధైర్యం కావాలి. వినోదం కోసం మాత్రమే ఈ సినిమా తీయడం లేదు. ఈ సినిమా కమర్షియల్‌గానూ మంచి సక్సెస్‌ సాధించాలి అని అన్నారు.

సదా మాట్లాడుతూ ‘‘వేదికపై ఎక్కువమంది మహిళలున్నారు. నిజంగా వీళ్ళందరితో ఇక్కడ ఇలా ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశం రావడం చాలా సంతోషంగా ఉంది. మధుబాలగారు చెప్పినట్టు… సినిమాకు సంతకం చేశానని చెబితే ‘హీరో ఎవరు?’ అని ఎక్కువశాతం మంది అడుగుతారు. ఈసారి మా సినిమాలో హీరో ఎవరూ లేరు. ఆరుగురు మహిళలు మెయిన్‌ లీడ్‌ క్యారెక్టర్స్‌ చేస్తున్నారు. మహిళల గురించి చెప్పే సినిమా ఇది. ఇటువంటి సినిమాకు పవన్‌ కంటే మంచి దర్శకుణ్ణి ఊహించలేం. ఈ సినిమా మంచి కలెక్షన్స్‌ రాబట్టాలని కోరుకుంటున్నా అన్నారు.

Related posts