Select your Top Menu from wp menus
Breaking News

అనుష్క సైలెన్స్.. కొత్త చిత్రానికి గ్రీన్ సిగ్నల్

అనుష్క సైలెన్స్.. కొత్త చిత్రానికి గ్రీన్ సిగ్నల్

అనుష్క.. కొత్త చిత్రం పట్టాలెక్కనుంది. ఈ చిత్రంలో ఓ ఎన్నారై బిజినెస్ వుమెన్‌‌గా అనుష్క కనిపించనున్నట్లు సమాచారం. అంజలి, షాలినీ పాండే కీలకపాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రానికి ‘సైలెన్స్’ అనే పేరు ఖరారు చేశారు. మార్చి నెల చివరకు ఈ చిత్రం షూటింగ్ ప్రారంభమవుతుందని ఫిల్మ్‌నగర్ సమాచారం. కథ, తన పాత్ర నచ్చడంతోనే అనుష్క ఈ చిత్రం ఒప్పుకున్నట్లు చెప్తున్నారు. ఎ ఫ్లాట్, ముంబై 125కేఎం, వస్తాడు నా రాజు వంటి చిత్రాలకు దర్శకత్వం వహించిన హేమంత్ మధుకర్ ఈ చిత్రానికి కూడా దర్శకత్వం చేయనున్నారు. సుబ్బరాజు, అవసరాల శ్రీనివాస్ తదితరులు నటిస్తున్నారు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, కోన ఫిలిం కార్పోరేషన్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. ఈ చిత్రంలో అనుష్క కొత్త లుక్‌లో కనిపించనున్నారని, అందుకోసం చాలా కష్టపడ్డారని తెలుస్తోంది.

Related posts