Select your Top Menu from wp menus
Breaking News

నాని ఇప్పుడు స్టార్ గా మారిపోయాడు

నాని ఇప్పుడు స్టార్ గా మారిపోయాడు
న్యాచురల్ స్టార్ నాని కొత్త సినిమా జెర్సి రిలీజ్ కు ముస్తాబవుతోంది. భీమిలి కబడ్డీ జట్టు తర్వాత నాని చేస్తున్న ఫుల్ లెన్త్ స్పోర్ట్స్ డ్రామా ఇది. కాకపోతే అప్పుడు జస్ట్ హీరోలా ఉన్న నాని ఇప్పుడు స్టార్ గా మారిపోయాడు కాబట్టి దానికి తగ్గట్టే అంచనాలు కూడా ఓ రేంజ్ లో ఉన్నాయి.  అందుకే సమస్య రాకుండా రెండు వెర్షన్ల క్లైమాక్స్ షూట్ చేశాడట గౌతమ్. ఒకవేళ ఒకే క్లైమాక్స్ తీసి తీరా అది నచ్చలేదు అనిపిస్తే మళ్ళి రీ షూట్ చేయడం చాలా వ్యయంతో కూడుకున్న వ్యవహారం. అందుకే నాని గౌతమ్ లు చాలా తెలివిగా ప్లాన్ చేసి ఇలా రెండు క్లైమాక్స్ లు సిద్ధం చేసి ఉంచుకున్నారు. ఒకవేళ రెండోది బాగుందన్న అభిప్రాయం వ్యక్తమైతే పడిన కష్టం ఇట్టే మర్చిపోవచ్చు. శ్రద్ధా శ్రీనాధ్ హీరోయిన్ గా టాలీవుడ్ కు పరిచయమవుతున్న జెర్సి వచ్చే నెల 5 న విడుదల చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. మరోసారి అధికారికంగా ప్రకటిస్తే పూర్తి క్లారిటీ రావొచ్చు

Related posts