Select your Top Menu from wp menus
Breaking News

‘జంగ్లీ’ ట్రైలర్ చూశారా..!‌

‘జంగ్లీ’ ట్రైలర్ చూశారా..!‌

 బాలీవుడ్ లో జంగ్లీ అనే మూవీ రిలీజ్ కాబోతోంది. దాని ట్రైలర్ ఇందాకే విడుదల చేసారు. తుపాకీలో హీరో విజయ్ ని ముప్పతిప్పలు పెట్టె విలన్ గా మెప్పించిన విద్యుత్ జమాల్ ఇందులో హీరో. బాల్యం నుంచే ఏనుగులతో స్నేహానికి అలవాటు పడిన హీరోకు అతుల్ కులకర్ణి బ్యాచ్ సంపదను కొల్లగొట్టడానికి ప్లాన్ చేసిందని తెలుస్తుంది. దాన్ని ఎలా పసిగట్టి అడవిని కాపాడుకున్నాడు అనేదే జంగ్లీ కథలా కనిపిస్తోందిఅడవిలో చూపించిన విజువల్స్ తప్ప ఇందులో కొత్తదనం అయితే ఏమి లేదు.  మోగ్లీ లాంటి మూవీస్ ని అద్భుతమైన విజువల్ ఎఫెక్ట్స్ తో తీర్చిదిద్దుతున్న ట్రెండ్ లో జంగ్లీలో కంటెంట్ చాలా మాములుగా అనిపిస్తుంది. దానికి తోడు గత సినిమాల్లో రఫ్ లుక్ తో హీరో విలన్ గా మ్యాచొ లుక్ తో ఉండే విద్యుత్ జమాల్ ని నున్నగా మీసాలు తీసేసి చూపించడం అచ్చం టైగర్ ష్రాఫ్ కవల సోదరుడిని తలపిస్తుంది. హీరొయిన్లు పూజా సావంత్-ఆశా భట్ గ్లామర్ కి ఆమడ దూరంలో ఉంటూ సైడ్ ఆర్టిస్టులు నయమనిపించేలా ఉన్నారు. పెద్దగా ఆకట్టుకునే విషయం కనిపించని జంగ్లీ సినిమాలో ఏమైనా అద్భుతాలు చేసిందేమో విడుదలయ్యాక చూడాలి.

Related posts