Select your Top Menu from wp menus
Breaking News

ఇంట్రస్టింగ్‌ న్యూస్‌…. మాజీ ప్రియుడితో హన్సిక

ఇంట్రస్టింగ్‌ న్యూస్‌…. మాజీ ప్రియుడితో హన్సిక

తెలుగు సినిమాతో ఇండస్ట్రీకి పరిచయం అయిన హన్సిక తరువాత కోలీవుడ్‌లో అడుగుపెట్టి స్టార్ హీరోయిన్‌గా గుర్తింపు తెచ్చుకుంది. సినిమాలతో పాటు తరుచూ వివాదాలతోనూ వార్తల్లో కనిపించే ఈ బ్యూటీ తాజా మరోసారి ఆసక్తికర వార్తలో హెడ్‌లైన్స్‌లో నిలిచింది. ప్రస్తుతం హన్సిక తన 50వ చిత్రంగా నటిస్తున్న మహా సినిమా కూడా తరుచూ వార్తల్లో వినిపిస్తూనే ఉంది.

తాజా ఈ సినిమాకు సంబంధించి మరో ఇంట్రస్టింగ్‌ న్యూస్‌ను ప్రకటించారు. ఈ సినిమాలో హన్సిక మాజీ ప్రియుడు కోలీవుడ్ స్టార్ హీరో శింబు అతిథి పాత్రలో కనిపించనున్నాడు. ఈ విషయాన్ని హన్సిక స్వయంగా సోషల్ మీడియా ద్వారా ప్రకటించారు. ‘న్యూస్‌ అనుకున్న సమయం కన్నా ముందే లీకైంది. నేను, శింబు ‘మహా’లో కలిసి నటిస్తున్నాం’ అంటూ ట్వీట్ చేసింది హన్సిక. ఇప్పటికే పోస్టర్ల వివాదంతో మంచి పబ్లిసిటీ సాధించిన ఈ సినిమా ఇప్పుడు శింబు, హన్సికల క్రేజీ కాంబినేషన్‌తో మరోసారి హాట్‌ టాపిక్‌గా మారింది.

Related posts