గ్రూప్‌ కాలింగ్‌ మాట్లాడుకోవడానికి పలు రకాల యాప్స్‌ ప్లేస్టోర్‌లో రెడీగా ఉన్నాయి. తాజాగా జియో కంపెనీ కూడా ఓ యాప్‌ను రంగంలోకి దించింది. అదే ‘జియో గ్రూప్‌ టాక్‌’. వాట్సాప్‌లో గ్రూప్‌ కాలింగ్‌ ఆప్షన్‌ ఉంది. త్వరలోనూ మరింత మందికి చేసుకునే సౌకర్యం కల్పించే పనిలో ఉంది ఆ సంస్థ. కానీ అంతకుముందే జియో ఓ అడుగు ముందుకు వేసింది. జియో టాక్‌ యాప్‌లో పది మందితో ఒకేసారి మాట్లాడుకోవచ్చు. మీకు నచ్చిన కాంటాక్ట్స్‌ను కావాల్సిన గ్రూప్‌లో సభ్యులుగా చేర్చుకోవాలి. అంతేకాదు ఒకరే ఎక్కువమందితో మాట్లాడుకునే ఆప్షనూ ఉందండోయ్‌. అయితే ఒకే ఒక్క కండిషన్‌. మీ ఫోన్‌లో కచ్చితంగా జియో సిమ్‌ ఉండాల్సిందే.