Select your Top Menu from wp menus
Breaking News

ఆ హీరోతో అయితేనే లిప్‌లాక్ చేస్తా: త‌మ‌న్నా

ఆ హీరోతో అయితేనే లిప్‌లాక్ చేస్తా: త‌మ‌న్నా
తోటి హీరోయిన్లు వెండితెర‌పై హీరోల‌తో లిప్‌లాక్ సీన్ల‌లో న‌టించినా మిల్కీ బ్యూటీ త‌మ‌న్నా మాత్రం ఇప్ప‌టివ‌ర‌కు ఆ సీన్ల‌కు దూరంగానే ఉంది. లిప్‌లాక్ సీన్లు చేయ‌న‌ని ద‌ర్శ‌కుల‌కు త‌మ‌న్నా ముందుగానే చెప్పేస్తుంద‌ట‌. తెర‌పై పెద‌వి ముద్దు సీన్ల‌లో న‌టించ‌డం చాలా ఇబ్బందిగా ఉంటుంద‌ని, అందుకే ద‌ర్శ‌కులు ఎంత న‌చ్చ‌చెప్పినా ఇప్ప‌టివ‌ర‌కు చేయ‌లేద‌ని ఓ కార్యక్ర‌మంలో త‌మ‌న్నా చెప్పింది.
భవిష్య‌త్తులో కూడా తెర‌పై లిప్‌లాక్ సీన్లు చేయ‌న‌ని చెబుతూనే ఒక హీరోకి మాత్రం మిన‌హాయింపు ఇచ్చింది. ఆ హీరోతో అయితే వెండితెర‌పై పెద‌వి ముద్దుల‌కు సిద్ధ‌మేన‌ని ప్ర‌క‌టించింది. ఆ హీరో ఎవ‌రో కాదు బాలీవుడ్ స్టార్ హృతిక్ రోష‌న్‌. త‌మ‌న్నాకు హృతిక్ రోష‌న్ అంటే చాలా ఇష్ట‌మ‌ట‌. హృతిక్‌తో క‌లిసి నటించే అవ‌కాశం వ‌స్తే అత‌నితో లిప్‌లాక్ సీన్లు చేయ‌డానికి త‌న‌కేం అభ్యంత‌రం లేద‌ని త‌మ‌న్నా చెప్పింది. గ‌తంలో ఒక‌సారి హృతిక్‌ను క‌లిసి ఫోటో దిగిన‌పుడు చాలా ఆనంద‌పడ్డాన‌ని చెప్పింది.

Related posts