తమిళ .. తెలుగు భాషల్లో యాక్షన్ హీరోగా విశాల్ కి మంచి క్రేజ్ వుంది. తన తమిళ సినిమాలు తప్పకుండా తెలుగు ప్రేక్షకులముందుకు ఆయన తీసుకువస్తుంటాడు. ప్రస్తుతం ఆయన తమిళంలో వరుస సినిమాలతో బిజీగా వున్నాడు. అయితే కొన్ని రోజులుగా ఆయన విపరీతమైన తలనొప్పితో బాధపడుతున్నారనే వార్త కోలీవుడ్ లో షికారు చేస్తోంది. తలనొప్పిని భరించలేకపోయిన ఆయన చెన్నైలోని ఓ హాస్పిటల్ లో చేరినట్టుగా చెప్పుకున్నారు.ఆ తరువాత ఆయన చెన్నై వైద్యుల సలహామేరకు అమెరికా వెళ్లాడనీ .. అక్కడ ట్రీట్మెంట్ జరుగుతున్నట్టుగా కూడా వార్తలు వచ్చాయి. ఈ విషయం విశాల్ వరకూ వెళ్లడంతో ఆయన స్పందించాడు. తాను మైగ్రేన్ తో కొన్ని రోజుల పాటు బాధపడిన మాట వాస్తవమే గానీ, హాస్పిటల్లో చేరలేదని చెప్పాడు. ఈ విషయంపై జరుగుతోన్న ప్రచారంలో ఎంతమాత్రం నిజంలేదనీ .. అదంతా కేవలం పుకారు మాత్రమేనని స్పష్టం చేశాడు. మార్చి ఫస్టు వీక్ నుంచి తిరిగి తాను రంగంలోకి దిగనున్నట్టు చెప్పాడు.