స్పైడర్ సినిమా ఊరించి ఊరించి థియేటర్లలోకి వచ్చేసింది. ప్రపంచవ్యాప్తంగా ప్రీమియర్ షోల తర్వాత ఈ సినిమాకు ఎలాంటి టాక్ వచ్చిందో చూద్దాం. స్పైడర్ ఫస్టాఫ్ సాధారణంగానే ఉంది. హత్యలకు సంబంధించిన ఇన్వెస్ట్‌గేషన్ స్టోరీతో సినిమా ప్రారంభమవుతుంది. సీబీఐ ఆఫీసర్‌గా మహేష్ ఇన్వెస్ట్‌గేషన్‌, రకుల్‌తో రొమాంటిక్ ట్రాక్‌తో కథ నడుస్తుంది. మరీ వావ్ అనిపించే సన్నివేశాలు అయితే ఫస్టాఫ్‌లో లేవు. ఇంటర్వెల్ బ్యాంగ్‌లో మెయిన్ విలన్ ఎస్‌జె.సూర్యకు తమ్ముడిగా చేసిన భరత్‌ను మహేష్ చంపేయడంతో సినిమాపై క్యూరియాసిటీ స్టార్ట్ అవుతుంది.
ఇక స్క్రీన్ ప్లే పరంగా ఫస్టాఫ్‌లో కొన్ని సీన్లు స్లోగానే ఉన్నాయి. ఇక కీలకమైన సెకండాఫ్‌లో మురుగదాస్ మార్క్ గ్రిప్పింగ్ స్క్రీన్ ప్లేతో సినిమా అదిరిపోతుంది. చివరి 30 నిమిషాలు మాత్రం థ్రిల్లింగ్ థ్రిల్లింగ్‌గా ఉంది. అయితే సినిమాలో ఎక్కువ బలహీన సన్నివేశాల మధ్య కొన్ని బాగా బలమైన సన్నివేశాలు మాత్రమే పడ్డాయి. ఎక్కువ మంచి సన్నివేశాలు చూశామనే ఫీలింగ్ ప్రేక్షకుడికి కలగదు.
ఇక ముందునుంచి అందరూ ఊహించిన విధంగానే ఓ సందేశాత్మక సన్నివేశంతో మురుగదాస్ చిత్రాన్ని ముగించాడు. ఓవరాల్ గా భారీ అంచనాలతో వచ్చిన స్పైడర్ యావరేజ్ చిత్రంగా మిగలనుంది. యాక్షన్ ప్రేక్షకులకు, యూత్‌, ఎడ్యుకేట్ ప్రేక్షకులకు బాగా నచ్చే ఈ సినిమా ఓవర్సీస్‌, ఏ సెంటర్ల ప్రేక్షకులకు బాగా కనెక్ట్ అవుతుంది. ఇక బీ, సీ సెంటర్లతో పాటు మహిళా ప్రేక్షకులకు ఎంత వరకు కనెక్ట్ అవుతుందో లేదో చూడాలి.