దుబాయ్‌లోని ఓ హోటల్ గదిలో బాత్‌టబ్‌లో మునిగి మృతి చెందిన శ్రీదేవి భౌతికకాయాన్ని ఆమె కుటుంబ సభ్యులకు కాసేపట్లో అప్పగించనున్నారు. ఇందుకు సంబంధించి ప్రాసిక్యూషన్ అధికారులు క్లియరెన్స్ లేఖ ఇచ్చారు. దీంతో ఆమెను అక్కడి నుంచి కాసేపట్లో ముంబయికి తరలించనున్నారు. ప్రస్తుతం శ్రీదేవి భౌతిక కాయానికి రసాయన ప్రక్రియ పూర్తి చేస్తున్నారు. ఆ తరువాత ఆమెను ప్రత్యేక విమానంలో ముంబయి తీసుకురావడానికి దాదాపు 4 గంటలు పడుతుంది.
కాగా, కేసులో అనేక అనుమానాలు వ్యక్తమవుతోన్న విషయం తెలిసిందే. శ్రీదేవి ప్రమాదవశాత్తు నీళ్లలో పడి మునిగి మృతి చెందారని అక్కడి ఆరోగ్య శాఖ పేర్కొన్న విషయంపై పలువురు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.