నటుడు శివబాలాజీ భార్య మధుమితను అశ్లీల మెసేజ్ లతో వేధించింది ఎవరో పోలీసులు కనిపెట్టేశారు. ఆమె ఫేస్ బుక్ వంటి సోషల్ మీడియా ఖాతాలకు వచ్చిన మెసేజ్ ల ఐపీ అడ్రస్ లను సేకరించిన పోలీసులు, ఓ వ్యక్తిని అనుమానిస్తూ, ప్రశ్నించేందుకు అదుపులోకి తీసుకున్నారు. ఆ వ్యక్తి ఎవరన్న విషయం అధికారికంగా ప్రకటించనప్పటికీ, సినీ పరిశ్రమకు సంబంధించిన వ్యక్తేనని సమాచారం. మధుమిత మొబైల్ ఫోన్ కు సైతం అతను, అతనితో పాటు మరో వ్యక్తి పేరిట రిజిస్టర్ అయిన సెల్ నంబర్ నుంచి కించపరిచేలా మెసేజ్ లు వచ్చినట్టు పోలీసులు గుర్తించారు. త్వరలోనే నిందితుల వివరాలను బయటపెడతామని సైబరాబాద్ పరిధిలోని సైబర్ క్రైమ్ పోలీసు వర్గాలు వెల్లడించాయి.