దివంగత రాజశేఖరరెడ్డి, తాను ఇద్దరం మంచి స్నేహితులమని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. ఇద్దరం కలిసే తిరిగేవారమని చెప్పారు. ఆయనకు టికెట్ ఇవ్వాలని ఇందిరాగాంధీకి తానే చెప్పానని అన్నారు. ఆ తర్వాత తాను టీడీపీలోకి వచ్చానని, కాంగ్రెస్ లోకి వైయస్ వెళ్లారని తెలిపారు. తమ ఇద్దరి మధ్య ఎలాంటి వైరం లేదని… అయితే వేర్వేరు పార్టీల్లో ఉన్నప్పుడు పోరాటం సహజమేనని చెప్పారు. వైయస్ కు చెందిన ఇంటి వివాదం గురించి మాట్లాడుతూ, ప్రభుత్వ భూమిలో ఆయన ఇల్లు కట్టుకున్నారని… ఈ మ్యాటర్ ను సెటిల్ చేయాలని కోర్టు ఆదేశించిందని… దీంతో, మార్కెట్ రేటు చెల్లించి, తీసుకోమని చెప్పామని… అయితే, ఫ్రీగా ఇవ్వాలని వైయస్ కోరారని… ఏదీ ఫ్రీగా ఇవ్వకూడదనేది తన ఆలోచన అని అన్నారు. 40 ఏళ్ల రాజకీయ ప్రస్థానంపై ఆంధ్రజ్యోతి ఎండీ రాధాకృష్ణకు ఇచ్చిన ముఖాముఖి ఇంటర్వ్యూలో ఆయన ఈ మేరకు స్పందించారు.