ఒకప్పుడు వరుస సక్సెస్ లతో శ్రీను వైట్ల అగ్రదర్శకుల జాబితాలో కనిపించేవాడు. అయితే ఆ తరువాత ఆయనకి వరుస పరాజయాలు ఎదురవుతూ వచ్చాయి. దాంతో ఆయనతో స్టార్ హీరోలు సినిమాలు చేయడానికి వెనుకడుగు వేయడం మొదలెట్టారు. ఈ నేపథ్యంలో గతంలో తనకి సక్సెస్ ను ఇచ్చిన కారణంగా ఆయనతో సినిమా చేయడానికి రవితేజ ముందుకు వచ్చాడు. ఈ సినిమాను నిర్మించడానికి మైత్రీ మూవీస్ వారు ముందుకొచ్చారు.అయితే ప్రస్తుతం వాళ్లు చరణ్ – సుకుమార్ కాంబినేషన్లో ‘రంగస్థలం’ సినిమా చేస్తున్నారు. అలాగే చందూ మొండేటి – నాగచైతన్య కాంబినేషన్లోను ఓ సినిమాను మొదలెట్టారు. ఆ సినిమాలు పూర్తయిన తరువాతనే రవితేజ సినిమాను సెట్స్ పైకి తీసుకెళతామనీ, అప్పటివరకూ ఆగకపోతే వేరే నిర్మాతను చూసుకోమని శ్రీను వైట్లకి చెప్పారట. మైత్రీ మూవీస్ బ్యానర్లోనే చేయాలనుకున్న శ్రీను వైట్ల, అప్పటివరకూ వెయిట్ చేయడానికి ఓకే అన్నాడని సమాచారం. అంటే .. ఈ ప్రాజెక్టు పట్టాలెక్కడానికి మరికొంత సమయం పడుతుందన్న మాట.