ప్రముఖ ఇన్‌స్టంట్ మెసేజింగ్ యాప్ వాట్సాప్‌లో ఇటీవలే ఓ నూతన ఫీచర్ అందుబాటులోకి వచ్చిన విషయం తెలిసిందే. యూజర్లు తాము సెండ్ చేసిన మెసేజ్‌లను 7 నిమిషాల వ్యవధిలోగా డిలీట్ చేసుకునే వీలు కల్పించారు. ఎవరికైనా పొరపాటుగా మెసేజ్ పంపితే దాన్ని డిలీట్ చేసేందుకు వీలుంటుందని ఈ ఫీచర్‌ను వాట్సాప్ కొత్తగా ప్రవేశపెట్టింది. అయితే ఈ విధంగా మెసేజ్‌లను డిలీట్ చేసినప్పటికీ మళ్లీ వాటిని తిరిగి పొందేందుకు వీలుంటుంది. అందుకు ఉపయోగపడేదే యాంటీ డిలీట్ యాప్. యాంటీ డిలీట్ యాప్ ఆండ్రాయిడ్ ప్లాట్‌ఫాంపై లభిస్తున్నది. దీన్ని యూజర్లు గూగుల్ ప్లే స్టోర్ నుంచి డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ఈ యాప్‌ను ఫోన్‌లో ఇన్‌స్టాల్ చేశాక ఓపెన్ చేసి అందులో యాంటీ డిలీట్ సర్వీస్ స్విచ్‌ను ఆన్ చేయాలి. దీంతో యాప్ బ్యాక్‌గ్రౌండ్‌లో రన్ అవుతుంటుంది. ఈ క్రమంలో వాట్సాప్‌లో మనం పంపుకునే మెసేజ్‌లను ఈ యాప్ ఎప్పటికప్పుడు ట్రాక్ చేసి స్టోర్ చేస్తుంది. ఒక వేళ మనం వాట్సాప్‌లో ఏదైనా మెసేజ్‌ను డిలీట్ చేసినా ఈ యాప్‌లోకి వచ్చి మళ్లీ ఆ మెసేజ్‌ను రీస్టోర్ చేసుకోవచ్చు. ఈ యాప్ ఆండ్రాయిడ్ 4.4 ఆపైన వెర్షన్ ఉన్న డివైస్‌లలో ఇన్‌స్టాల్ చేయవచ్చు..