అర్జున్ రెడ్డి సినిమా పోస్టర్ ల కలకలం ఇంకా వీడడం లేదు. మొన్న ఒక మూడు రోజుల క్రితం బస్సు మీద కనపడిన అర్జున్ రెడ్డి పోస్టర్ ని చింపుతూ కనిపించారు వీ హనుమంతరావు. ఆయన ఫోటో ని ఫేస్ బుక్ లో పెట్టి ‘ చిల్ ‘ తాతా అంటూ కామెంట్ చేసాడు విజయ్ దేవరకొండ.


రామ్ గోపాల్ వర్మ ని హైదరాబాద్ లో అడుగు పెట్ట నివ్వం .

ఆ తరవాత ఆ పోస్టర్ లు చాలా అసభ్యకరంగా ఉన్నాయి అంటూ మహిళా సంఘాలు సైతం గొడవ చెయ్యడం తో ఆ పోస్టర్ లు ప్రొడ్యూసర్ లే స్వయంగా తీయించేసారు . ప్రసుతం అవి ఎక్కడా లేకుండా చూసుకున్నారు నిర్మాతలు.ఈ విషయం లో రామ్ గోపాల్ వర్మ అర్జున్ రెడ్డి బృందానికి సపోర్ట్ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఒక అందమైన అమ్మాయి తనకి ముద్దు పెట్టలేదు అనే కుళ్ళు తోనే వీహెచ్ అలా చేసారు అంటూ రామూ కామెంట్ చెయ్యడం వివాదానికి తెర లేపింది.


రామ్ గోపాల్ వర్మ ని హైదరాబాద్ లో అడుగు పెట్ట నివ్వం .

ఈ సినిమా పోస్టర్లపై తన చర్యలను విమర్శించిన దర్శకుడు రాంగోపాల్ వర్మ తీరును కాంగ్రెస్ నేత వి.హనుమంతరావు తీవ్రంగా దుయ్యబట్టారు. అశ్లీల దృశ్యాల పోస్టర్లను బాహాటంగా ప్రదర్శించడమే కాకుండా, దానిని సమర్థించడ మేమిటంటూ వీహెచ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ” రామ్ గోపాల్ వర్మ కి సరైన టైం లో బుద్ధి చెబుతాము. అతను హైదరాబాద్ లో అడుగు పెట్టకుండా చేస్తాం. ముంబై లో కూర్చుని పిచ్చోడిలగా ఏదో వాగడం కాదు . . ఈ సారి అతగాడు హైదరాబాద్ లో ఎలా అడుగు పెడతాడో నేను చూస్తా ” అంటూ సవాల్ చేసారు వీహెచ్.