బాలీవుడ్ నటీమణి ప్రియంక చోప్రా సినీ పరిశ్రమలో లైంగిక వేధింపులు అంశంపై ఓ సంచలన వ్యాఖ్య చేసింది. ప్రస్తుతం హాలీవుడ్ సినిమాలతో బిజీగా వుంటున్న ప్రియాంక.. తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. పురుషాధిక్యమే లైంగిక వేధింపులకు కారణం అని అభిప్రాయపడింది.’లైంగిక వేధింపులు అనేవి అన్ని రంగాల్లోనూ కామన్. సినీ ప్రపంచం అంటే గ్లామరస్‌ ఇండస్ట్రీ. ఇక్కడ ఇంకాస్త ఎక్కువ వుంటాయంతే. నేను కూడా లైంగిక వేధింపుల బాధితురాలినే. ఓ దశలో తీవ్రమైన లైంగిక వేధింపుల్ని ఎదుర్కొన్నాను. నాలా చాలామంది ఎదుర్కొన్నారు. ఇప్పటికీ ఎదుర్కుంతున్నారు. మేల్ డామినేషన్ దీనికి కారణం” అని వ్యాఖ్యానించింది ప్రియాంక. అంతేకాదు.. ఇక్కడ పవర్‌, పలుకుబడి ముఖ్యమా. ఆ పవర్‌ మహిళలకూ దక్కితే లైంగిక వేధింపులు తగ్గుతాయని ఓ సలహా కూడా ఇచ్చింది ప్రియాంక. ఇప్పుడు బాలీవుడ్ లో ప్రియాంక చేసిన కామెంట్స్ హాట్ టాపిక్ గా మారాయి.